జితేందర్ రెడ్డి ట్వీట్పై ఈటల రాజేందర్ రియాక్ట్

Update: 2023-06-30 07:42 GMT

తెలంగాణ బీజేపీలో జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ అలజడి రేపుతోంది. ఈటల వర్గాన్ని టార్గెట్ చేసుకునే ఆయన ఈ ట్వీట్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఆ ట్వీట్పై ఈటల రాజేందర్ స్పందించారు. ఆ ట్వీట్కు అర్థమేంటో జితేందరే చెప్పాలని అన్నారు. ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించొద్దని చెప్పారు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏది పడితే అది చేస్తే మంచిది కాదని హితవు పలికారు.

తెలంగాణ కాషాయ నాయకత్వానికి షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలంటూ ఓ వీడియోను జితేందర్ రెడ్డి ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి జడలబర్రెను వాహనంలో ఎక్కిస్తున్నాడు. అది పైకి ఎక్కకపోవడంతో దాని ముడ్డిపై తన్ని ఎక్కించాడు. ‘‘బీజేపీ తెలంగాణ నాయకత్వానికి ఇలాంటి చికిత్స చేయాలి’’ అని జితేందర్ రెడ్డి కామెంట్ పెట్టారు. ఆ ట్వీట్‌ను బీజేపీ జాతీయ నేతలైన బీఎల్ సంతోష్, అమిత్ షాలకు కూడా ట్యాగ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


Tags:    

Similar News