బీజేపీ - బీఆర్ఎస్ పొత్తు.. మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

By :  Krishna
Update: 2024-02-21 12:21 GMT

తెలంగాణలో బీఆర్ఎస్-బీజేపీ పొత్తు అంశం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు ఉండదని బీజేపీ నేతలు చెబుతున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో బీజేపీతో పొత్తుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము పొత్తుల కోసం అర్రులు చాచడం లేదన్నారు. జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీలతో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. పొత్తులు అనేవి ఆయా పార్టీల అధ్యక్షులు నిర్ణయిస్తారని చెప్పారు.

గత ప్రాజెక్టులను పూర్తి చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 365 రోజులు నీటి లభ్యత ఉండేలా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును రూపొందించామని చెప్పారు. ఆ ప్రాజెక్టు పూర్తైతే నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు కెనాల్స్ ద్వారా నీరు ఇవ్వొచ్చని.. కానీ రేవంత్ సర్కార్ ఆ ప్రతిపాదనలను రద్దు చేసిందని ఆరోపించారు. ఇప్పుడు కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టుతో కొత్త పంచాయతీ పెట్టొద్దని సూచించారు.

తుంగభద్ర, కృష్ణా ప్రాజెక్టులపై కర్నాటక సర్కార్ ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందని.. రేవంత్ ప్రభుత్వం దమ్ముంటే వాటిని ఆపాలని నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. కొడంగల్​ ప్రాంతానికి నీళ్ల రావడాన్ని బీఆర్ఎస్​ స్వాగతిస్తుందన్న ఆయన.. కొడంగల్‌ ఎత్తిపోతలను జూరాలపై కడితే మిగతా ప్రాజెక్టులకు ఇబ్బందులు ఏర్పడతాయని వివరించారు. అంతేకాకుండా కొత్త ప్రాజెక్ట్ వల్ల ఆలస్యం కూడా ఎక్కువ అవుతుందన్నారు.


Tags:    

Similar News