Telangana Assembly Elections: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా

By :  Krishna
Update: 2023-10-31 07:40 GMT

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. కొత్తగూడెం బీఆర్ఎస్ టికెట్ ఆశించిన వెంకట్రావుకు గులాబీ బాస్ షాకిచ్చారు. కానీ ఆ టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఇచ్చారు. పైగా కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైన పార్టీకి గుడ్ బై చెప్పారు.

కాగా ఇటీవలే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేసిన హైకోర్టు జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. గత ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు అనర్హత వేటు వేసింది. అయితే వనమా సుప్రీంను ఆశ్రయించగా.. అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. ఈ క్రమంలో ఈ సారి టికెట్ తనకే అని భావించిన జలగం వెంకట్రావుకు నిరాశే ఎదురైంది.

Tags:    

Similar News