Inter exams fee: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే?

By :  Bharath
Update: 2023-12-29 14:03 GMT

తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎగ్జామ్ ఫీజు తేదీ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ.2,500 లేట్ ఫీజుతో.. జనవరి 3వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడగించింది. కాగా డిసెంబర్ 21తో ఫీ పేమెంట్ తేదీ ముగిసింది. తాజాగా ఆ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బోర్డ్ సూచించింది. రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్ని కోర్సుల్లో కలిపి.. 10,59,233 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా ఇప్పటి వరకు 9,77,044 మంది విద్యార్థులు మాత్రమే ఫీజు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్ టైం టైబుల్‌ను నిన్న రాత్రి ప్రకటించింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News