Rameswaram Cafe : రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. భాగ్యనగరంలో తనిఖీలు

Byline :  Shabarish
Update: 2024-03-02 13:33 GMT

బెెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఓ వ్యక్తి తెచ్చిన బ్యాగ్ కారణంగానే పేలుడు సంభవించిందని తేలింది. అయితే ఐఈడీ కారణంగానే ఈ పేలుడు జరిగిందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. దీంతో దేశంలోని పలు నగరాల్లో కేంద్రం హై అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌లో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. పలుచోట్ల సోదాలు చేపడుతున్నారు.

రామేశ్వరం కేఫ్ ఘటనపై సీసీ టీవీ ఫుటేజీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కర్ణాటక డీజీపీ పేలుడుకు బాంబు కారణమని స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ టీమ్, బాంబు స్క్వాడ్ టీమ్ ఇచ్చిన నివేదికల ప్రకారం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అలర్ట్ అయ్యింది. ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఆ నివేదికలను చూడనుంది. 2007వ సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో జంట పేలుళ్లు జరిగాయి. గోకుల్ చాట్, లుంబినీ పార్క్ బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు వదిలివెళ్లిన బ్యాగే కారణమని అందరికీ తెలిసిందే. సరిగ్గా ఆ విధంగానే ఇప్పుడు రామేశ్వరం కేఫ్ ఘటన జరిగింది.

జంట పేలుళ్ల నుంచి హైదరాబాద్ ఇంకా కోలుకోలేదు. ఇప్పుడు బెంగళూరులోని ఈ తరహా ఘటన జరగడంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ హై అలర్ట్ మోడ్ లోకి రావడంతో పోలీసులు తనిఖీలను చేపడుతున్నారు. ఇకపోతే నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్‌పోర్టులల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. పెద్ద పెద్ద హోటల్స్, మాల్స్, కేఫ్‌లల్లో తనిఖీలు చేపట్టేందుకు స్పెషల్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News