ఫలక్‎నుమా రైలు ప్రమాదం..చైన్ లాగి ప్రజల ప్రాణాలు కాపాడిన వ్యక్తి ఎవరు?

Update: 2023-07-07 09:27 GMT

ఫలక్‌నుమా రైలులో పెను ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఈ ఎక్స్‌ప్రెస్ రైలులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులంతా రైలు నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్యలో ఈ ఘటన జరిగింది. రైలు సికింద్రాబాద్ స్టేషన్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 6 బోగీలకు మంటలు అంటుకోగా.. 4 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఇదిలా ఉండగా ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన ఓ వ్యక్తి వెంటనే ట్రైన్‎లోని చైన లాగాడు. దీంతో రైలులో ప్రయాణించేవారంతా హుటాహుటాని రైలు దిగి వెళ్లిపోయారు. ప్రయాణికులు రైలు దిగిన వెంటనే బోగీలను క్షణాల్లోనే దట్టమైన పొగలు కప్పేశాయి. మంటలకు దాదాపు ఆరు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. అయితే ప్రమాదాన్న గుర్తించి చైన్ లాగిన వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వెంటనే రైల్వే సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారని తెలుస్తోంది. సదరు వ్యక్తి శ్రీకాకుళం జిల్లా పలాస వాసి అని సమాచారం.




 





 





Tags:    

Similar News