ప్రజావాణిలో అర్జీ.. బర్రె కోసం బోరుమన్న రైతు..

Byline :  Kiran
Update: 2023-12-22 07:20 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి వందలాది మంది తరలివస్తున్నారు. తమ సమస్యలు తీర్చాలంటూ అర్జీలు ఇస్తున్నారు. శుక్రవారం జరిగిన ప్రజావాణిలో వికారాబాద్ జిల్లా పరిగి మండలానికి చెందిన సాయిరెడ్డి అనే వ్యక్తి బర్రె కోసం బోరున విలపించాడు. తన బర్రె చనిపోయిందని, దానికి చెల్లించాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడం లేదని ప్రజావాణిలో తన ఆవేదన వినిపించాడు.

గత ప్రభుత్వం 2018లో తనకు ఓ బర్రెను ఇచ్చిందని సాయిరెడ్డి చెప్పారు. అందుకోసం తాము రూ. 40వేలు కట్టామని ప్రభుత్వం మరో రూ.40వేలు సబ్సిడీ ఇచ్చిందని అన్నారు. అయితే అది 2019 నవంబర్లో అనారోగ్యంతో చనిపోయిందని చెప్పాడు. పోస్ట్మార్టం రిపోర్ట్ ఇతర డాక్యుమెంట్లు సమర్పించి ఇన్స్యూరెన్స్ కోసం క్లెయిమ్ చేయగా అధికారులు రిజెక్ట్ చేశారని, ఎందుకు అలా చేశారని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోవాలని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ సమస్య పరిష్కారం కోసం ప్రజావాణిలో అర్జీ ఇచ్చినట్లు సాయిరెడ్డి చెప్పాడు.

Full View



Tags:    

Similar News