Bhatti Vikramarka : ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం.. అసెంబ్లీ ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి
(Bhatti Vikramarka) తెలంగాణ సమాజం మార్పు కోరుకుందని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ మూడో శాసన సభలో ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆయన.. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని దానిని రూపొందించామని అన్నారు. రూ. 2,75,891 కోట్లతో ప్రవేశపెట్టిన ఆయన.. అందరి కోసం మనమందరం అనే స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని అన్నారు. సమానత్వమే తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి స్పష్టం చేశారు.
పేదలు, మహిళల అభ్యున్నతికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని భట్టి చెప్పారు. అమరుల కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పదేళ్ల తర్వాత నిజమైన స్వేచ్ఛను చూస్తున్నామని, ప్రజలకు పాలకులకు మధ్య కంచెలు తొలగించామని అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకిచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని, అందుబాటులో ఉన్న వనరులతో సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని భట్టి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు దుబారా ఖర్చు తగ్గిస్తామని చెప్పారు.