ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్నిప్రమాదం..1.25కోట్ల నష్టం

Update: 2023-06-10 10:01 GMT

ఖమ్మం పత్తి మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడడంతో నిల్వ ఉంచిన పత్తి బస్తాలకు మంటలు అంటుకున్నాయి. దీంతో షెడ్డులో ఉన్న దాదాపు 1600 పత్తి బస్తాలు కాలిపోయినట్లు తెలుస్తోంది. మార్కెట్ మొత్తం దట్టంగా పొగ కమ్మేయడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. పక్క షెడ్డులోని బస్తాలకు కూడా మంటలు వ్యాపించే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం వల్ల రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసి నిల్వ చేసుకున్న వ్యాపారికి సుమారు రూ.1.25 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 




 


Tags:    

Similar News