హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని బాబీ లాడ్జి దగ్గర ఉన్న ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. షాపు నుంచి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మంటలు ఎగసిపడుతుండటంతో చుట్టుప్రక్కల నివసించే వారు ప్రాణ భయంతో రోడ్డుపైకి పరుగులు తీశారు. స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే దుకాణం నిండా దుస్తులు ఉండడంతో అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయి.
అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న దుకాణం సమీపంలోనే పలు లాడ్జీలు ఉన్నాయి. అప్రమత్తమైన అధికారులు లాడ్జిల్లో ఉన్నవారిని ఖాళీ చేయిస్తున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లతో అగ్నికీలలు పక్కనున్న షాప్‌లకు విస్తరించకుండా చర్యలు చేపట్టారు. భారీ అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాలన్ని దట్టమైన పొగతో నిండిపోయాయి. దీంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. షాట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, సికింద్రాబాద్ పరిధిలో గత కొంతకాలంగా రెండు షాపింగ్ కాంప్లెక్స్ లు, ఓ లాడ్జీలో అగ్ని ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు నేడు లష్కర్ బోనాలు మొదలవడంతో ఆప్రాంతమంతా జనంతో కిక్కిరిసి పోయింది. అగ్ని ప్రమాదం జరిగిన చోట పోలీసులు ఆ ప్రాంతంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ దారిగుండా భక్తులు రాకుండా వేరే మార్గంలో పంపించి వేస్తున్నారు.
#WATCH | Telangana: Massive fire breaks out in 3 shops in Palika Bazar, Secunderabad. Fire tenders present at the spot. No casualties reported pic.twitter.com/dkE3JCiWWJ
— ANI (@ANI) July 9, 2023