ఎల్బీనగర్లో కూలిన ఫ్లైఓవర్ ర్యాంప్..10మందికి గాయాలు

Update: 2023-06-21 02:55 GMT

హైదరాబాద్ ఎల్బీ నగర్ సమీపంలో ప్రమాదం జరిగింది. సాగర్ రింగ్ రోడ్డు చౌరాస్థాలో నిర్మిస్తున్న ఫ్లైఓవర్ ర్యాంప్ కూలి 10 మందికి గాయాలయ్యాయి. బైరామల్ గూడా వైపు నుంచి ఫ్లై ఓవర్ పైకి వెహికిల్స్ ఎక్కే ర్యాంప్ కుప్పకూలింది. రెండు పిల్లర్లకు మధ్య నిర్మిస్తున్న ర్యాంప్ కూలడంతో దానిపై పనులు చేస్తున్న కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

గాయపడ్డ కార్మికులు ఉత్తరప్రదేశ్, బీహార్కు చెందిన వారిగా గుర్తించారు. రెడీ మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద స్ధలాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదంపై ఉన్నతాధికారులతో విచారణ జరుపుతామని చెప్పారు.

Tags:    

Similar News