Nagarkurnool District : 30 మంది విద్యార్థినులకు అస్వస్థత.. పలువురి పరిస్థితి విషమం
Byline : Bharath
Update: 2023-09-14 16:53 GMT
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రబాద్ మండలం మన్ననూర్ గిరిజన హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటనలో 30 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనంలో టమాటా చారు తిన్న స్టూడెంట్స్ కు వాంతులు, తీవ్ర కడుపు నొప్పితో బాధ పడ్డారు. అందులో 30 మంది విద్యార్థినుల అస్వస్థకు గురికాగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వెంటనే స్టూడెంట్స్ ను అచ్చంపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు పాఠశాల సిబ్బంది. ఘటనపై సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు హాస్పిటల్ కు చేరుకుని ఆందోళనకు దిగాయి.