నిజామాబాద్ జిల్లాలోని కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి భోజనం వికటించి ఏకంగా 90 విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తినడం వల్ల సోమవారం అర్థరాత్రి నుండి విద్యార్థినులు వాంతులు, మోషన్స్, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. దీంతో అప్రమత్తమైన కస్తూర్బా పాఠశాల సిబ్బంది స్కూల్ ఇన్‌ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ శోభ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత హుటాహుటిన విద్యార్థినులను స్థానికంగా ఉన్న నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన స్టూడెంట్స్కు వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.