ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వివాదాస్పద నిర్ణయం.. కన్నడిగుల ఆగ్రహం

Byline :  Vamshi
Update: 2024-02-24 05:47 GMT

శ్రీశైలం మల్లన్న దర్శనానికి నల్లమలలో కాలినడక వెళ్లే భక్తుల నుంచి టికెట్ వసూలు చేయాలని అటవీ శాఖ నిర్ణయించింది. శివ రాత్రికి నల్లమలలో లక్షల సంఖ్యలో భక్తులు కాలినడకన శ్రీశైలం వెళ్లడం అనవాయితీగా వస్తోంది. అయితే ఫారెస్ట్‌లో శ్రీశైలం వెళ్లాలంటే ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 టికెట్‌ను అటవీ శాఖ వసూలు చేస్తోంది. దీంతో కన్నడిగులు ఆందోళనకు దిగారు.

ఓ నిర్ణయం వివాదానికి దారి తీసింది. మరికొద్ది రోజుల్లో శివరాత్రి పండుగ రాబోతోంది. దీంతో అనేక మంది భక్తులు కాలినడకన శ్రీశైలం వెళ్లి భ్రమరాంబ మల్లికార్జునస్వామిని దర్శించుకుంటారు. నల్లమల అటవీ ప్రాంతం నుంచే భక్తులు కాలినడకన వెళ్తుంటారు. అయితే కాలినడకన వెళ్లే వారి విషయంలో అటవీశాఖ తీసుకున్న నిర్ణయం భక్తుల ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.

Tags:    

Similar News