హాస్పిటల్ బెడ్‌పై కేసీఆర్.. ఎమోషనల్ పోస్ట్ చేసిన కవిత

Update: 2023-12-08 05:17 GMT

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) యశోద ఆస్పత్రిలో చేరారు. నిన్న రాత్రి ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ బాత్రూం లో కాలు జారి పడివపోవడంతో ఎడమ కాలికి గాయమైంది. నిన్న(గురువారం) అర్ధరాత్రి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్ తుంటి ఎముక రెండు చోట్ల విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉందన్నారు. తుంటి ఎముకు రిప్లేస్ చేయనున్నట్లు, ఈ మధ్యాహ్నం తర్వాత ఆపరేషన్ చేయనున్నట్లు తెలిసింది.


కాగా ఈ విషయంపై కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేసీఆర్‌కు స్వల్ప గాయం కావడంతో ప్రస్తుతం హాస్పిటల్ లో డాక్టర్ల సంరక్షణలో ఉన్నట్లు తెలిపారు. నాన్న త్వరలో పూర్తిగా కోలుకోనున్నారని..అందరి ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు కవిత. కేసీఆర్ అస్వస్థతకు గురైన వార్త తెలిసిన వెంటనే కేటీఆర్‌ కుటుంబంతోపాటు హరీష్‌రావు కూడా రాత్రే యశోద ఆస్పత్రికి వెళ్లారు. తెల్లవారుజాము వరకూ అక్కడే ఉన్నారు. డాక్టర్లు చేయాల్సిన మెడికల్ టెస్ట్‌లపై, సర్జరీపై క్లారిటీ ఇచ్చాక ఇంటికి వెళ్లారు.

ఇదిలా ఉండగా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు... సర్జరీ నేపథ్యంలో కేసీఆర్ హాజరుకాకవపోవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు సీఎంగా రేవంత్ రెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. ఈ తొలి సమావేశానికి కేసీఆర్ రాకపోవచ్చనే అంటున్నారు కొంతమంది.



Tags:    

Similar News