నిజాం పాలనకు నిదర్శనం కేసీఆర్ పాలన : రేవంత్‌రెడ్డి

Byline :  Vamshi
Update: 2024-03-17 07:21 GMT

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ప్రజా పాలన అందించామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు స్వేచ్చ కోరుకుని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని ఆయన అన్నారు. గతంలో అభివృద్ధి సంక్షేమం పేరుతో మాజీ సీఎం కేసీఆర్ రాచరిక పాలన చేశారని ప్రజలు నిరసలు చేయకుండా అడ్డుకున్నారని సీఎం దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని సీఎం తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కేసీఆర్ నాశనం చేశారని కాంగ్రెస్ వంద రోజుల పాలనలో 8 లక్షల కుటుంబాలు రూ.500 సిలిండర్ అందుకున్నారు. అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

1948 సెప్టెంబర్‌ 17కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే 2023 డిసెంబర్‌ 3కు చరిత్రలో అంతే ప్రాముఖ్యత ఉంది. 1948 సెప్టెంబర్‌ 17న నిజాం రాచరిక పాలన అంతమైంది. 2023 డిసెంబర్‌ 3న కేసీఆర్‌ పాలన అంతమైంది. మా వారసులే అధికారంలో ఉండాలని నిజాం నవాబు కోరుకున్నారు. అభివృద్ధి చేశాను కాబట్టి నేనే అధికారంలో ఉండాలని నిజాం కోరుకున్నారు. నిజాం లాగే కేసీఆర్‌ కూడా రాచరికాన్ని తేవాలని చూశారు. వారసులను సీఎం చేయాలని కేసీఆర్ అనుకున్నారు.” అని రేవంత్ అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్‌లో టీజీ బదులు టీఎస్‌ తీసుకొచ్చారు. టీఆర్‌ఎస్‌కు నకలుగానే టీఎస్‌ను తెచ్చారు. ‘జయ జయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించలేదు. మా ప్రభుత్వంలో ధర్నా చౌక్‌లో నిరసనలకు అనుమతులు ఇచ్చాం. తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు తీసుకొస్తున్నామని సీఎం తెలిపారు.

Tags:    

Similar News