బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పరామర్శల వెల్లువ కొనసాగుతోంది. ఇటీవల తుంటి ఎముక సర్జరీ చేయించుకున్న కేసీఆర్ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఆస్పత్రిలో ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సహా కొంతమంది ప్రముఖులు పరామర్శించారు. ఇక ఇటీవల ఏపీ సీఎం జగన్ కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు. ఇదే క్రమంలో ఇవాళ మాజీ గవర్నర్ నరసింహన్ కేసీఆర్ను పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలసుకున్నారు. నరసింహన్కు కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. కాగా నరసింహన్ 2009 నుంచి 2019 వరకు తెలంగాణ గవర్నర్గా పనిచేశారు. నరసింహన్తో కేసీఆర్ ఎంతో సఖ్యతగా వ్యవహరించారు.