Mahmood Ali : జెండా ఎత్తుతూ.. పడిపోయిన మాజీ హోంమంత్రి

Byline :  Bharath
Update: 2024-01-26 06:51 GMT

తెలంగాణ భవన్ లో ఘనంగా ప్రారంభమైన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అపశృతి నెలకొంది. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ.. అస్వస్థతకు గురయ్యారు. వేడుక సందర్భంగా జెండా ఎగరేస్తున్న క్రమంలో ఆయన అస్వస్థతకు గురై.. స్పృతి కోల్పోయి కిందపడ్డారు. వెంటనే స్పందించిన సిబ్బంది.. మహమూద్ అలీకి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






Tags:    

Similar News