హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

Byline :  Kiran
Update: 2023-12-19 09:18 GMT

మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్‌ సమీపంలోని మూడుచింతలపల్లి కేశవరంలో 47 ఎకరాల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని ఈ నెల 6న ఫిర్యాదు అందింది. దీంతో శామీర్పేట పోలీసులు మల్లారెడ్డిపై చీటింగ్, అట్రాసిటీ కేసు నమోదుచేశారు. ఆయనతో పాటు మరో 9 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.

గిరిజనులకు చెందిన ఆ భూమితో తనకెలాంటి సంబంధం లేదని గతవారం మల్లారెడ్డి అన్నారు. అసలు తనకు భూకబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. కొంతమంది మధ్యవర్తులు కొనుగోలు, అమ్మకాల్లో ఉన్నారని.. గిరిజనుల భూమిని వారే కబ్జా చేసి ఉంటారని ఆరోపించారు. ఈ ఘటనలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్య ఉన్నట్లు భావించడం లేదన్నారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి భూకబ్జాకు పాల్పడ్డారంటూ భిక్షపతి అనే వ్యక్తి శామీర్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరంలో 47 ఎకరాల గిరిజన భూమిని మాజీ మంత్రి కబ్జా చేశారని ఆరోపించారు. దీనిపై స్పందించిన పోలీసులు మల్లారెడ్డిపై కేసు బుక్ చేశారు.

Tags:    

Similar News