మహిళలకు ఫ్రీ బస్సు తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదు : Niranjan Reddy

Byline :  Krishna
Update: 2024-02-18 12:46 GMT

కాంగ్రెస్ పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా ప్రజలకు ఒరిగిందేమి లేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ చెప్పేవన్నీ అబద్ధాలన్నారు. ఇప్పటివరకు మూడెకరాల లోపు రైతులకు మాత్రమే రైతు బంధు పడిందని.. మిగితా వాళ్లకు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. హామీల గురించి ప్రశ్నిస్తే 100 రోజులు ఆగండి అంటున్నారని.. ఇప్పటికే 72 రోజులు పూర్తయ్యాయని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలుకాలేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ కోతలు స్టార్ట్ అయ్యాయని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. బోర్లకు కరెంట్ లేక రైతులు సబ్ స్టేషన్ల వద్ద ధర్నాలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు. బీఆర్ఎస్ ప్రశ్నించగానే కాళేశ్వరాన్ని ముందుకు తెస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరంలో ఏమైన లోపాలు ఉంటే విచారణ జరపాలని తేల్చి చెప్పారు. కానీ రైతులకు మాత్రం సాగు నీరు అందించాలన్నారు. ఇచ్చిన హామీలను విస్మరిస్తే ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు.

Tags:    

Similar News