Revanth Reddy : సీఎం రేవంత్ను కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

Byline :  Kiran
Update: 2024-01-23 14:21 GMT

బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు రేవంత్ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. తమ నియోజకవర్గాలకు చెందిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకేసారి సీఎంను కలవడం చర్చనీయాంశంగా మారింది.

అంతకు ముందు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిశారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి అదనపు భద్రత ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై దాడి జరిగిన నేపథ్యంలో వారు శివధర్ రెడ్డిని కలిసి సెక్యూరిటీ అంశంపై చర్చించారు.



Tags:    

Similar News