తెలంగాణకు నాలుగురోజుల పాటు వర్ష సూచన

Update: 2023-07-16 10:54 GMT

తెలంగాణ ప్రజలకు హెచ్చరిక. రాష్ట్రవ్యాప్తంగా రానున్న నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలోని వాయువ్య ప్రాంతంలో గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈమేరకు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది.

సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వికారాబాద్‌, సంగారెడ్డి, కామార్డె జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని.. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాతో పాటు నిజామాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

బుధవారం నుంచి గురువారం వరకు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. 


Tags:    

Similar News