Sangareddy : స్లాబ్ వేస్తుండగా కూలిన చర్చి.. ఇద్దరు మృతి

Byline :  saichand
Update: 2024-01-07 08:25 GMT

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోహీర్‌లో నిర్మాణంలో ఉన్న చర్చి కూలి ఇద్దరు మృతి చెందారు. మెథడిస్ట్ చర్చి స్లాబ్‌ వేస్తుండగా సెంట్రింగ్ మెటీరియల్ కూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. శిథిలాల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొందరిని బయటకు తీయగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద సంఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




Tags:    

Similar News