హైదరాబాద్లో యాపిల్ ఎయిర్ పాడ్స్ తయారీ..?

By :  Lenin
Update: 2023-08-15 16:33 GMT

గ్లోబల్ టెక్ జెయింట్ యాపిల్‌ ప్రొడక్స్ తయారీకి హైదరాబాద్‌ హబ్గా మారనుంది. యాపిల్ కంపెనీ హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఎయిర్‌పాడ్స్‌ను తయారు చేయనున్నట్లు సమాచారం. ఫాక్స్‌కాన్ దాదాపు 400 మిలియన్ డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. అందులో 2024 డిసెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యే ఛాన్సుంది. ఈ క్రమంలోనే ఫాక్స్ కాన్ హైదరాబాద్ ప్లాంటులో యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రొడక్షన్ వచ్చే ఏడాది డిసెంబర్ లో ప్రారంభం కావచ్చని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశంపై యాపిల్ గానీ, ఫాక్స్ కాన్ గానీ స్పందించలేదు.

భారత్‌లో ఇప్పటికే ఐఫోన్స్ ఉత్పత్తి జరుగుతోంది. ఎయిర్‌పాడ్స్ తయారీ కూడా షురువైతే దేశంలో తయారయ్యే రెండో యాపిల్ ప్రొడక్ట్ కానుంది. ఇంటర్నేషనల్ ట్రూ వైర్‌లెస్ స్టీరియో మార్కెట్‌లో యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఇప్పటికే దుమ్మురేపుతోంది. రీసెర్చ్ సంస్థ కెనలిస్ ప్రకారం.. 2022 డిసెంబర్ క్వార్టర్‌లో మార్కెట్లో యాపిల్ ఎయిర్ పాడ్స్ వాటా 36 శాతంగా ఉంది. 

Tags:    

Similar News