నంది అవార్డుల పేరుతో గద్దర్ అవార్డులు : సీఎం రేవంత్ రెడ్డి
By : Mic Tv Desk
Update: 2024-01-31 14:18 GMT
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. గద్దరన్న పేరు మీద సినీ కళాకారులకు పురస్కారాలు అందజేస్తామని సీఎం అన్నారు. దీనిపై త్వరలో జీవో జారీ చేస్తామని తెలిపారు.హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. తన నిర్ణయాన్ని అందరూ ఆమోదిస్తారని రేవంత్ అన్నారు. సహచర మంత్రుల ఆమోదం కూడా తన నిర్ణయానికి ఉంటుందన్నారు. ప్రతి ఏటా గద్దర్ జయంతి రోజున సినిమా అవార్డుల ప్రదానం ఉంటుందని అన్నారు. కళకారులను గద్దర్ పేరిట గౌరవించుకోవడం సముచితమని ఈనిర్ణయాన్ని తీసుకున్నట్లు రేవంత్ తెలిపారు. ఈసారి గద్దర్ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది.