కంటోన్మెంట్ నుంచి ఎన్నికల బరిలో ఉంటా : Gaddar Daughter Vennela
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు దివంగత ప్రజాగాయకుడు గద్దర్ కూతురు వెన్నెల ప్రకటించారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుంచి ఎన్నికల బరిలో ఉంటానని తెలిపారు. టికెట్ ఇవ్వకపోయినా పోటీ చేయడం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. తన తండ్రిని కాంగ్రెస్ చేరదీసిందని.. అందుకే ఆ పార్టీ తరుపున పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్లో తనకు సభ్యత్వం లేకపోయినా కాంగ్రెస్ సానుభూతిపరులం అని వివరించారు.
తన అన్న చాలా సెన్సిటివ్ అని.. అందుకే ఎన్నికలకు దూరంగా ఉంటారని వెన్నల తెలిపారు. గద్దర్ త్యాగాలను గుర్తించి కాంగ్రెస్ టికెట్ ఇస్తుందని భావిస్తున్నట్లు వెన్నెల ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలను, నాయకులను కలుపుకుని ముందుకెళ్తామని స్పష్టం చేశారు. కాగా తన కూతురుకు టికెట్ ఇస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. కానీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని గద్దర్ సతీమణి విమల ఆరోపించారు. తన కూతురుకు టికెట్ ఇస్తూ తాను కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.