ప్రజాకవి గద్దర్ స్థాపించిన విద్యాలయంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఈ మేరకు అల్వాల్లోని మహాబోధి విద్యాలయంలో సోమవారం గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి ఆయన అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. అల్వాల్ వరకు ఈ యాత్ర కొనసాగనుంది.
ఇదిలా ఉంటే ప్రజల సందర్శనార్థం గద్దర్ పార్థీవ దేహాన్ని ఎల్బీ స్టేడియానికి తరలించారు. గేట్ నెంబర్ 6 వద్ద భౌతిక కాయాన్ని ఉంచారు. గద్దర్ పార్థివదేహానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, బీజేపీకి చెందిన నాయకులు నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.