కాంగ్రెస్ పార్టీకి షాక్.. మరో కీలక నేత రాజీనామా

By :  Krishna
Update: 2023-11-15 10:16 GMT

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. రేపు తన అనుచరులతో కలిసి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేసిన వారికి పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదని అనిల్ అన్నారు. కార్యకర్తలు, అనుచరుల కోరికమేరకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

కాగా అనిల్ కుమార్ నర్సాపూర్ టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం ఆ టికెట్ను ఆవుల రాజిరెడ్డికి ఇవ్వడంతో పార్టీ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

Tags:    

Similar News