గెలిచిన ఎమ్మెల్యేల లిస్టు గవర్నర్కు అందించిన వికాస్ రాజ్

By :  Kiran
Update: 2023-12-04 12:01 GMT

తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికైన ఎమ్మెల్యేల లిస్టును సీఈఓ వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈ గెజిట్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు అందజేసింది. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను కూడా సీఈవో వికాస్‌రాజ్‌ గవర్నర్‌కు ఇచ్చారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటైంది.

గెజిట్ నోటిఫికేషన్ జారీతో కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకార ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈసీ బృందం గవర్నర్‌ను కలవడంతో కాంగ్రెస్ ప్రతినిధి బృందం కూడా గవర్నర్‌తో సమావేశం కానుంది. కాంగ్రెస్ శాసన భాపక్షనేతగా ఎన్నికైన వారి పేరును గవర్నర్‌కు నివేదించి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరనున్నారు. అనంతరం సీఎల్పీ నేతకు డిజిగ్నేటెడ్ సీఎం హోదా ఇచ్చి ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారు. ఈ ప్రక్రియ ఈ రోజే పూర్తికానుంది.

సీఎం ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్‌లో ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. ఈ రోజే ప్రమాణ స్వీకారం ఉండవచ్చన్న సమాచారంతో ముందస్తు ఏర్పాట్లు చేశారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు రాజభవన్‌కు వెళ్లి.. ప్రస్తుతం అసెంబ్లీ రద్దు తీర్మాన ప్రతిని గవర్నర్‌కు అందించారు. కొత్త మంత్రుల కోసం ప్రోటోకాల్ అధికారులు కాన్వాయ్ సిద్ధం చేశారు. ఆరు కొత్త ఇన్నోవా వెహికిల్స్ రెడీ చేసిన అధికారులు దిల్‌కుషా గెస్ట్ హౌస్కు వాటిని తీసుకొచ్చారు.

Tags:    

Similar News