ఇవాళ GHMC కౌన్సిల్ మీటింగ్.. వాటిపై వాడీ వేడీ చర్చ

By :  Krishna
Update: 2024-02-19 02:12 GMT

జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్కు అంతా సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10.30కు సమావేశం జరగనుంది. ఇప్పటికే సభ్యులు తమ ప్రశ్నలను సమర్పించారు. సభ్యుల నుంచి 126 ప్రశ్నలు రాగా.. వాటిలో 23పై చర్చించే అవకాశం ఉంది. గత మూడేళ్ల జీహెచ్ఎంసీ పాలనపై ఈ సభలో వాడీవేడీ చర్చ జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జీహెచ్ఎంసీ మీటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ మేయర్ ఉండడంతో.. గులాబీ పార్టీ గళం ఏ విధంగా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 56 స్థానాల్లో విజయం సాధించింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో పలువురు కార్పొరేటర్లు హస్తం పార్టీలోకి వెళ్లారు. ఇక బీజేపీకి 47 మంది సభ్యుల బలం ఉంది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కావడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ను విమర్శించే అవకాశాలు తక్కువే. ఇదే సమయంలో గత ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు కాంగ్రెస్ సభ్యులు సిద్ధమయ్యారు. అటు బీజేపీ సభ్యులు సైతం బీఆర్ఎస్ తీరును ఎండగట్టాలనే ప్లాన్లో ఉంది. దీంతో కౌన్సిల్ సమావేశం వాడీవేడీగా జరగనుంది. 

Tags:    

Similar News