లోక్ సభల ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ లోని అసంతృప్తుల నేతలు హాస్తం గూటికి చేరేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత ఆమె భర్త శోభన్ రెడ్డి. ఈ మేరకు గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జి దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్ లోకి చేరారు. వారికి దీప దాస్ మున్షి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ లోకి చేరిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఉదయమకారులను బీఆర్ఎస్ విస్మరించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో అవమానాలు, అన్యాయం తట్టుకోలేక అందులోని నాయకులు కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారందరికి సమూచిత స్థానం కల్పిస్తామని భరోసానిచ్చారు. తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి వైపు నడిపించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల ఆధారంగా ఏర్పడిందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.