మోదీకి నిరసన సెగ.. కరెంట్ పోల్ ఎక్కిన యువతి

By :  Krishna
Update: 2023-11-11 15:15 GMT

తెలంగాణలో ప్రధాని మోదీకి నిరసన సెగ ఎదురైంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ఎస్సీ విశ్వరూప మహాసభలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తుండగా.. ఓ యువతి కరెంట్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. ఇది గమనించిన మోదీ కరెంట్ పోల్ దిగాలని విజ్ఞప్తి చేశారు. ‘‘నేను మీకోసమే ఇక్కడికి వచ్చాను. నేను మీ మాట వింటాను. ఇలా చేయడం కరెక్ట్ కాదు’’ అని మోదీ అన్నారు. కాగా బీజేపీ వచ్చాక కుల, మతాల పేరుతో రెచ్చగొడుతున్నారంటూ సదరు యువతి ఆరోపించింది. మహిళలపై జరుగుతున్న దాడులపై స్పందించడం లేదు గానీ.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యింది.

ఈ సభలో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేశారు. వర్గీకరణకు తమ పార్టీ కట్టుబడి ఉందని, దీని కోసం త్వరలోనే కమిటీ వేస్తామని తెలిపారు. మాదిగల పొరాటానికి తమ మద్దతు విషయంలో తిరుగులేదని, మంద కృష్ణ మాదిగ ముప్పై ఏళ్లుగా మొక్కవోని పోరాటం చేస్తున్నారని ప్రధాని ప్రశంసిచారు. వర్గీకరణను అమలు చేయలేకపోయినందుకు అన్ని రాజకీయ పార్టీల తరపున తను క్షమాపణ కోరుతున్నానన్నారు.బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళితలకు ద్రోహం చేశాయని ప్రధాని మండిపడ్డారు.

Tags:    

Similar News