గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం రెండో ప్రమాద హెచ్చరిక

Update: 2023-07-28 05:33 GMT

థంబ్ : భద్రచలం వద్ద ఉగ్ర గోదావరి

భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. వరద ప్రవాహం కాస్త తగ్గినట్లు కనిపించినా నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం భద్రచలం వద్ద గోదావరి నీటి మట్టం 46.20 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో అప్రమత్తమైన అధికారులు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరోవైపు ములుగు జిల్లా వాజేడు మండలంలోనూ గోదావరికి వరద పోటెత్తింది. పేరూరులో నీటిమట్టం 48.44 అడుగులకు పెరిగింది. దీంతో వెంకటాపురం - భద్రాచలం రహదారి బ్రిడ్జిలపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. వెంకటాపురం, వాజేడు మండలాల్లో రోడ్లపైకి నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. వరద నీటి కారణంగా టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. 

Tags:    

Similar News