నేను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయను.. రాజాసింగ్

Byline :  Lenin
Update: 2023-12-08 14:06 GMT

తెలంగాణ కొత్త అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అయితే ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ స్పష్టం చేశారు. ఎంఐఎం, బీజేపీలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో రాజాసింగ్ అలక వహించారు.

శనివారం ఉదయం 8.30 గంటలకు రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయిస్తారు. తర్వాత అక్బరుద్దీన్ అసెంబ్లీ చేరుకుని ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అసెంబ్లీకి ఎక్కువసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలను ప్రొటెం స్పీకర్‌గా నియమస్తారు. అక్బరుద్దీన్‌ ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. వేర్వేరు కారణాల వల్ల కేసీఆర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులకు ప్రొటెం స్పీకర్‌గా వ్యహరించే అవకాశం లేకపోవతో అక్బరుద్దీన్ తెరపైకి వచ్చారు. 

Tags:    

Similar News