రేవంతర్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన సలహాదారుల నియామకాలను రద్దు చేసింది. ఈ మేరకు వారి నియామకాలను రద్దు చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్, వ్యవసాయశాఖ ముఖ్య సలహాదారు చెన్నమనేని రమేష్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, లా అండర్ ఆర్డర్ సలహాదారు అనురాగ్ శర్మ, మైనారిటీ వెల్ఫేర్ సలహాదారు ఏకే ఖాన్ల నియామకాలను రేవంత్ సర్కార్ రద్దు చేసింది.