ఇంద్రవెల్లి స్థూపం విస్తరణ.. ఎకరం స్థలం కేటాయించిన ప్రభుత్వం

By :  Kiran
Update: 2023-12-08 04:05 GMT

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలోని అమరుల స్థూపం అభివృద్ధి, సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీసీఎల్ఏ ప్రతిపాదనల మేరకు ఎకరం స్థలం కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న స్థూపాన్ని సుందరీకరణ, అభివృద్ధి కోసం సర్వే నెంబర్ 240లోని ఎకరం స్థలాన్ని కేటాయించినట్లు రెవన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రకటించారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

మరోవైపు ప్రొ. జయశంకర్ సొంత గ్రామం అక్కంపేటను రెవెన్యూ విలేజ్‌గా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హన్మకొండ జిల్లా పరకాల డివిజన్ ఆత్మకూరు మండల పరిధిలోని అక్కంపేట ప్రస్తుతం పెద్దాపూర్ గ్రామ పరిధిలో ఉంది. ఈ క్రమంలో పెద్దాపూర్ గ్రామం నుంచి అక్కంపేటను విడదీసి రెవెన్యూ గ్రామంగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ గ్రామ, మండల, డివిజన్, జిల్లా ప్రజలకు ఏవైనా అభ్యంతరాలుంటే 15 రోజుల్లోగా జిల్లా కలెక్టర్‌కు రాతపూర్వకంగా తెలియజేయాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత అక్కంపేట గ్రామాన్ని లాంఛనంగా రెవెన్యూ గ్రామంగా ప్రభుత్వం గుర్తించనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామాన్ని రెవెన్యూ విలేజ్‌గా గుర్తించడం ప్రాధాన్యం సంతరించుకుంది.



telangana news,telugu news,congress government,indravelli,amarula sthupam,one acre land,revenue department,naveen mittal,indravelli sthupam development,prof jayashankar,akkampet,revenue village,notification,district collector,cm revanth reddy,new 

Tags:    

Similar News