Osmania Hospital : ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ !

Byline :  Vamshi
Update: 2024-02-12 15:23 GMT

రోజురోజుకూ శిథిలావస్ధకు చేరుకుంటున్న ఉస్మానియాకు త్వరలో మహర్దశ పట్టనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా ఆసుపత్రి రూపురేఖలే మారిపోనున్నాయి. నిజాం కాలంలో నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని, పెచ్చులు ఊడుతున్న సంగతి తెలిసిందే

ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం కట్టాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం తీసుకున్నది. అతి త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వైద్య సంఘాలతో హెల్త్ మినిస్టర్ చెప్పినట్లు సమాచారం. సోమవారం వైద్యారోగ్యశాఖలోని వివిధ సమస్యల పరిష్కారం కోసం వైద్యసంఘాలు హెల్త్ మినిస్టర్‌తో భేటీ అయ్యాయి. దాదాపు గంట సేపు చర్చించాయి.

పేషెంట్‌ను ఎలుక కొరికిన ఘటనలో కామారెడ్డిలో వైద్యులపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డాక్టర్లు కోరారు. టీవీవీపీని డైరెక్టరేట్ పరిధిలోకి తీసువచ్చి ట్రెజరీ సాలరీలు ఇవ్వాలని, 33 మెడికల్ కాలేజీల్లోని సమస్యలపై, జనరల్ ట్రాన్స్ ఫర్స్, డీఎంఈ పరిధిలో ప్రొఫెసర్‌ల వయోపరిమితి అంశాలపై చర్చించినట్లు డాక్టర్లు వెల్లడించాారు. వీటన్నింటిని అతి త్వరలోనే పరిష్కరిస్తారని మంత్రి చెప్పినట్లు వైద్యులు ప్రకటించారు.ఉస్మానియా హాస్పిటల్ కూల్చవద్దని కొందరు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు స్టే ఇచ్చిందన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు వేసిన ఐఐటి హైదరాబాద్ నిపుణుల కమిటీ కూడా ఆస్ప‌త్రి అవసరాలకు ఈ భవనం పని చేయదని చెప్పిందని వారు వివరించారు.హైకోర్టు తుది తీర్పు మేరకు కొత్త నిర్మాణం త్వరలో చేపడతామని వైద్య అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News