తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. గృహలక్ష్మి పథకంలో వారికి 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి రూ.3లక్షలు అందించేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకొచ్చింది. దీనికి సంబంధించి కేసీఆర్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర దివ్యాంగులాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి ఇటీవలే సీఎం కేసీఆర్‌కు కలిసి గృహలక్ష్మి పథకంలో రిజర్వేషన్ల కోసం విజ్ఞప్తి చేశారు. దానిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి వాసుదేవరెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. ఆయనకు దివ్యాంగుల సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పారు.
మరోవైపు గృహలక్ష్మి పథకంలో ఎస్సీలకు 20, ఎస్టీలకు 10, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్‌ను అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గృహలక్ష్మి పథకం కింద 4లక్షల మందికి ఇండ్లు మంజూరు చేయనున్నారు. వాటిలో ఒక్కో నియోజకవర్గానికి 3,000 చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించనున్నారు. రాష్ట్ర కోటాలో మరో 43వేల ఇండ్లకు అనుమతి ఇవ్వనున్నారు. పథకం కింద లబ్ధిదారులకు అందించే రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని మూడు దఫాలుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు.
government to implement 5 percent reservation in gruhalakshmi scheme for disabled persons
telangana,cm kcr,gruha lakshmi scheme,reservation,disabled persons,vasudeva reddy,sc,st,bc,minorities,rs 3 lakhs,housing scheme