బోనం ఎత్తిన గవర్నర్ తమిళిసై.. రాజభవన్లో ఘనంగా వేడుకలు

Update: 2023-07-16 09:33 GMT

రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ బోనం ఎత్తారు. రాజ్భవన్ లో ఘనంగా బోనాల వేడుకలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ.. గవర్నర్ రాజ్భవన్ లోని నల్లపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు. దాంతో రాజ్భవన్ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్.. రాష్ట్ర ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.




 


బోనాలకు పిలుపు రాలే:

రాష్ట్ర పండుగ బోనాల వేడుకకు ఎప్పటిలాగే ప్రభుత్వం నుంచి పిలుపు రాలేదని గవర్నర్ అన్నారు. అందుకే రాజ్భవన్ లో బోనాల వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు.

Tags:    

Similar News