ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని శుభ్రం చేసిన గవర్నర్ తమిళిసై

Byline :  Krishna
Update: 2024-01-20 12:23 GMT

ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని గవర్నర్ తమిళిసై సందర్శించారు. స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆలయాన్ని శుభ్రం చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 22న అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశంలోని ఆలయాలన్నింటిని శుభ్రం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు పలు ఆలయాలను శుభ్రం చేశారు. నాసిక్ లోని కాలారం ఆలయాన్ని ప్రధాని మోదీ శుభ్రం చేశారు. బషీర్బాగ్ లోని కనకదుర్గమ్మ ఆలయాన్ని కిషన్ రెడ్డి శుభ్రం చేశారు.

Tags:    

Similar News