ఈ రాష్ట్రంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్నా: గవర్నర్

Update: 2023-06-11 11:26 GMT

తెలంగాణ రాష్ట్రంలో తాను ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్నట్లు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. కిమ్స్ కడిల్స్ ఉమెన్ హెల్త్ కార్యక్రమంలో మాట్లాడిన గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండేళ్లుగా ఆరోగ్యశాఖ అధికారులు తనతో అందుబాటులో లేరని అన్నారు. అవరోధాలను అవకాశాలుగా మార్చుకోవడమే తన బలమని.. అలాగే తెలంగాణలో ఆవిడకు ఎదురైన అవరోధాలన్నింటినీ దాటగలుగుతున్నట్లు చెప్పారు. అంతేకాకుండా.. పరిస్థితులకు తగినట్లు స్పందించడం ద్వారా పనిభారాన్ని తగ్గించుకోవచ్చని వ్యాఖ్యానించారు.

‘సమాజంలో మహిళలు తమ సమస్యలు చెప్పేందుకు ముందుకు రావాల్సి ఉంది. చిన్నప్పటి నుంచే ఆడపిల్లలకు లైంగిక వేధింపులపై అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లల కోసం కాస్త టైం కేటాయించాలి. అప్పుడే వాళ్ల సమస్యల నుంచి బయట పడగలుగుతారు. అందరికీ ఆరోగ్య బీమాపై అవగాహన రావాలి. ఆరోగ్యశ్రీ, ఆయుష్యాన్ భారత్ వంటి పథకాలు పేదలకు మంచి వైద్యం అందించేందుకు ఉపయోగపడతాయి. ఒక మహిళ విజయం 1000 మంది పురుషుల విజయంతో సమానం’అని గవర్నన్ తమిళసై అన్నారు.




Tags:    

Similar News