గ్రూప్ 2 పరీక్షలకు సిద్ధం అవుతున్న మర్రి ప్రవళిక (23).. హైదరాబాద్ అశోక్ నగర్ లోని ఓ హాస్టల్ లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడం వల్ల మనస్తాపానికి చెందిన ప్రవళిక.. హాస్టల్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవాన్మరనానికి పాల్పడింది. ఈ క్రమంలో ప్రవళిక మృతిపై గవర్నర్ తమిళసై స్పందించారు. ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన తమిళసై.. ప్రవళిక మృతి పట్ల 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్పీఎస్సీ కార్యదర్శిని ఆదేశించారు.
ప్రవళిక ఆత్మహత్య ఘటన తనను చాలా బాధకు గురిచేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘ప్రవళికది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ హత్యే. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిల్లాడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరు క్షణం జాబ్ క్యాలెండర్ వస్తుంది. యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీని బలోపేతం చేస్తాం. అధికారం చేపట్టిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తా’మని రాహుల్ చెప్పుకొచ్చారు.