Green India Challenge:రాజమౌళి ఫాంహౌస్‌లో చెట్లు నాటిన ఎంపీ సంతోష్ కుమార్

Update: 2023-07-14 05:55 GMT

సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్న కాలుష్యాన్ని పారద్రోలేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. శంషాబాద్ దగ్గర రోడ్డు విస్తరణలో తొలగిస్తున్న 20 వృక్షాలను రీలొకేట్‌ చేస్తామని తెలిపారు. రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన 20 వృక్షాలను దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి (Director SS Rajamouli) ఫాం హౌస్‌లో, మరో 15 చెట్లను వివిధ చోట్ల వట ఫౌండేషన్‌ (Vata foundation) సాంకేతిక సహకారంతో నాటారు.

అనంతరం మాట్లాడిన జోగినిపల్లి సంతోష్ కుమార్.. ఒక్క మాట అడగగానే తన ఫాంహౌజ్ లో మొక్కలు నాటేందుకు అవకాశం కల్పించిన రాజమౌళి సహృదయతకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా వృక్షాలను రీలోకేట్ చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. చెట్లు నాటడం మాత్రమే కాదు వాటిని కాపాడటంలోనూ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” చూపిస్తున్న అమితమైన చొరవపై ప్రకృతి ప్రేమికులు జోగినిపల్లి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఫౌండర్ మెంబర్ రాఘవ, వట ఫౌండేషన్ ఉదయ్, మదన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News