గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష పేపర్ లీక్ అయిన తర్వాత ఆ పరీక్షను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. ఇవాళ తిరిగి నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 503 పోస్ట్ ల భర్తీకి 3.80 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అయితే, ఇవాళ 994 కేంద్రాల్లో జరిగిన గ్రూప్ 1 పరీక్షకు కేవలం 2,32,457 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. గతంలో జరిగిన లోటు పాట్లు. గందరగోళాలను సరిదిద్ది పరీక్షను నిర్వహించినా.. అభ్యర్థుల్లో అసంతృప్తి కారణంగా కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే హాజరయ్యారు.
సిద్దిపేటలో పరీక్ష ప్రారంభానికి ముందే.. కేంద్రం నుంచి బయటికి వచ్చిన ప్రశాంత్ అనే అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దీనిపై క్లారిటీ ఇచ్చిన యువకుడు.. ఓఎంఆర్ షీట్ లో హాల్ టికెట్ నంబర్ తప్పుగా రాశాని, దానివల్ల పరీక్ష రాసినా ఉపయోగం ఏం ఉండదని భావించి బయటికి వచ్చినట్లు తెలిపాడు. అయితే, క్రిమినల్ యాక్ట్ గా భావించిన పోలీసులు ప్రశాంత్ పై మాల్ ప్రాక్టీసింగ్ కేసు నమోదు చేశారు.