బీజేపీకి క్యాడర్ లేదు.. కాంగ్రెస్కు క్యాండిడేట్లు లేరు: మంత్రి హరీష్ రావు
thumb: మెదక్లో పదికి పది సీట్లు గెలిచి చూపిస్తా
అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న క్రమంలో సీఎం కేసీఆర్ సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి హరీష్ రావు.. మెదక్ జిల్లాలో పదికి పది సీట్లు గెలిచి సీఎం కేసీఆర్ కు గిఫ్ట్ ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి క్యాడర్ లేదని, కాంగ్రెస్ కు క్యాండిడేట్లు లేరని వ్యంగ్యాస్థ్రాలు గుప్పించారు. కేసీఆర్ వ్యూహాన్ని ఎవరూ ఊహించలేదని, కేసీఆర్ అభ్యర్థుల ప్రకటనతో విపక్షాలు ఆగమయ్యాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటుందని ఆరోపించారు. ఆగస్టు 23 న సీఎం మెదక్ టూర్ ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు పర్యవేక్షించిన హరీష్ రావు.. మెదక్ లో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్, పోలీస్ కార్యాలయం, సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికుల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న హరీష్ రావు.. మెదక్ సభలోనే వికలాంగులకు ఆసరా పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. కేసీఆర్ ప్రగతి శంకారావాన్ని మెదక్ నుంచి పూరిస్తారని, అభ్యర్థల ప్రకటనతో తమ పార్టీ ధీమాగా ఉందని తెలిపారు. బీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అయిందన్న హరీష్.. దేశ వ్యాప్తంగా రైతులు కేసీఆర్ పథకాలను కావాలంటున్నారని చెప్పారు.
Harish Rao confidence they will win 10 out of 10 seats in Medak
harish rao,Medak,cm kcr,medak meating,mla seats,brs,bjp,congress,telangana