ఎన్ని ట్రిక్కులు చేసినా, హ్యాట్రిక్ కొట్టేది మేమే.. హరీశ్ రావు

Update: 2023-07-10 08:57 GMT

బిఆర్ఎస్ పార్టీ రిజెక్ట్ చేసిన నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని ప్రతిపక్ష పార్టీలు.. జబ్బలు చరుచుకోవటం సిగ్గుచేటు అని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు, హారీశ్ రావు అన్నారు. పటాన్ చెరు పట్టణంలోని నూతనంగా నిర్మించిన ఫ్రీడమ్ పార్క్, డిసిసిబి బ్యాంక్, అర్ అండ్ బి గెస్ట్ హౌజ్, భవనాలను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తో కలిసి మంత్రి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సారధ్యంలో పటాన్ చెరు నియోజకవర్గం రూపురేఖలు మార్చేశారని అన్నారు. గతంలో కాలుష్య కోరల్లో ఇబ్బంది పడుతుండే పటాన్ చెరు.. నేడు రోజురోజుకు అభివృద్ధి పధంలో దూసుకుపోతున్నదని తెలిపారు. ఐటీ సేవల విస్తరణకు పటాన్ చెరు కేంద్రం కాబోతున్నదని చెప్పారు. సంగారెడ్డికి మెడికల్ కళాశాల, పటాన్ చెరుకు రెండు వందల పడకల ఆసుపత్రి మంజూరు చేయటం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ననే తెలిపారు.

ప్రతిపక్ష పార్టీలు అధ్యక్షులను మార్చినా, ఔట్ డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం తథ్యం అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అడిగింది ఇవ్వకుండా, అసలు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మోసం చేసింది అని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు. దక్షిణ భారత దేశం అభివృద్ధిలో బీజేపీకి చిన్నచూపు ఎందుకు అని అడిగారు. బీజేపీ ద‌క్షిణాది రాష్ట్రాలకు ఏమైనా ఇచ్చిందా అంటే అది కేవలం శుష్కప్రియాలు, శూన్య హస్తాలు మాత్రమే అని విమ‌ర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంద‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు.

Tags:    

Similar News