మాతా శిశు సంరక్షణలో తెలంగాణ..దేశానికే రూల్ మోడల్ : హరీష్ రావు
వైద్యారోగ్య వ్యవస్థను సీఎం కేసీఆర్ పటిష్ఠంగా మార్చారని మంత్రి హరీష్ రావు అన్నారు. మాతాశిశు మరణాలు తగ్గింపులో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనకు ఇదే నిదర్శనమన్నారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎంసీహెచ్ బ్లాక్, 33 నియోనేటల్ అంబులెన్సులను ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో మాతా, శిశువుల కోసం ఉన్న 300 పడకలకు తోడు 200 పడకలు అదనంగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
మాతా శిశు మరణాలను మరింత తగ్గించే దిశగా ప్రభుత్వం 3 మదర్ అండ్ చైల్డ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు హరీష్ రావు తెలిపారు. గాంధీతో పాటు నిమ్స్, అల్వాల్‌లో నిర్మిస్తున్న టిమ్స్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మూడు ఆస్పత్రుల్లో మాతా, శిశువులకు కావాల్సిన వైద్య సదుపాయాలు అన్ని అందుబాటులో ఉంటాయన్నారు. బిడ్డ కడుపులో పడ్డప్పుడు న్యూట్రీషన్ కిట్.. డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 14 లక్షల మందికి కేసీఆర్ కిట్, 6లక్షల మందికి న్యూట్రీషన్ కిట్ అందించినట్లు చెప్పారు. మాతా శిశు సంరక్షణలో తెలంగాణ దేశానికి రూల్ మోడల్ మారిందన్నారు.
33 నియోనాటల్ అంబులెన్స్...
నవజాత శిశువులను అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు తరలిచేందుకు 33 నియోనాటల్ అంబులెన్స్ లను ప్రారంభించినట్లు హరీష్ రావు చెప్పారు. వీటితో పుట్టిన ప్రతి బిడ్డను కాపాడుకోవడం సాధ్యమవుతుందన్నారు. అత్యాధఉనిక సౌకర్యాలతో జిల్లాకు ఒకటి చొప్పున 33 నియోనాటల్ అంబులెన్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. తల్లి బాగుంటే ఇల్లు బాగుంటుంది.. పిల్లలు బాగుంటే భావి భారతం బాగుంటుందని వివరించారు. అందుకే సీఎం కేసీఆర్ మాతా శిశు సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.