మాటల్లో కాదు చేతల్లో చూపిన హరీష్ రావు.. వీడియో

Update: 2023-07-24 13:12 GMT

నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే రాష్ట్ర మంత్రి హరీష్ రావు.. మరోసారి ఆయన సేవా గుణాన్ని చాటుకున్నారు. అధికార పార్టీ నేత, మంత్రిననే విషయాన్ని పక్కనబెట్టి.. పారిశుధ్య పనుల్లో స్వయంగా పాల్గొన్నారు. ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించారు. ఆయన నియోజక వర్గం సిద్ధిపేటలో ‘నడుస్తూ చెత్త ఏరుదాం’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం వేళ నగరంలోని వార్డుల్లో తిరుగుతూ.. డ్రైనేజిలోని చెత్తను తన చేతులతో తీసేశారు. సోమవారం (జులై 24) ఉదయం సిద్ధిపేటలోని 18వ వార్డులో పర్యటించిన ఆయన.. మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను స్వయంగా తొలగించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి.

Full View

ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం అంటూ ప్రజలకు సూచించారు. కాలనీల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ కవర్లు, వాటర్, చాయ్ గ్లాసులు, శానిటరీ వేస్ట్ చెత్తను చేతులతో ఎత్తి సంచిలో వేశారు. ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని.. సీజనల్ వ్యాధుల భారిన పడకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని నిర్వహించిన ఆనంద యోగా క్యాంపు కార్యక్రమానికి హాజరైన హరీష్.. 100 మంది అభ్యాసకులకు యోగా మ్యాట్లు పంచిపెట్టారు. పట్టణంలోని వార్డుల వారీగా 10 రోజుల ఉచిత యోగా శిబిరం నిర్వహించి అందరికీ యోగాపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.


నడుస్తూ చెత్తను ఏరుదాం..

Tags:    

Similar News