దివ్యాంగుల పెన్షన్ వెంటనే అమలు చేయాలి: హరీశ్ రావు

By :  Bharath
Update: 2023-12-25 12:39 GMT

దివ్యాంగులను గత ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందని, అండగా నిలిచిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ఒక్కడే మానసిక దివ్యాంగుల పట్ల మానవతా హృదయాన్ని చాటుకున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మానసిక దివ్యాంగులకు అభయ జ్యోతి ద్వారా ఏర్పాటుచేసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దివ్యాంగులకు నెలకు రూ.4వేల పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని చెప్పుకొచ్చారు. కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీల్లో భాగంగా వికలాంగులకు ఇస్తానన్న రూ.6వేల పెన్షన్ వెంటనే అందించాలని కోరారు.

ఏ రాష్ట్ర ప్రభుత్వం రూ.400, 700 కంటే ఎక్కువ పెన్షన్ ఇవ్వలేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ రూ.4వేలకు పెంచిన ఘనత కేసీఆర్ దని అన్నారు. కొంతమంది మానసిక దివ్యాంగుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని, వారు తమ దృష్టిలో మనుషులే కాదన్నారు హరీశ్. కంటి సమస్యలు పరిష్కారించేందుకు సిద్దిపేటలో కూడా ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ ను ఏర్పాటు చేశాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


Tags:    

Similar News