రైతు బీమా తరహాలో కార్మిక బీమా పెంపు: హరీష్ రావు

Update: 2023-07-30 15:20 GMT

కార్మికులకు మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షాణ తప్పక నిలబడుతుందని హామీ ఇచ్చారు. కార్మికులకు డిజిటల్ లేబర్ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా రైతు బీమా తరహా కార్మిక బీమా పథకాలు అమలు చేస్తామని తెలిపారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో జరిగిన భవన నిర్మాణ రంగాల కార్మికుల జిల్లా మహాసభలో పాల్గొన్న మంత్రి కార్మికులకు భరోసానిచ్చారు.

ప్రస్తుతం కార్మికుల ప్రమాద బీమా రూ. లక్షా30 వేలు ఉండగా.. దాన్ని రూ. 3 లక్షలకు పెంచేందుకు కృషిచేస్తామన్నారు. ఇందులో భాగంగానే కార్మికులకు త్వరలోనే డిజిటల్ కార్డులు అందిస్తామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5లక్షల వరకు ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు వర్తించేలా చేస్తామని అన్నారు. క్యాన్సర్, గుండె చికిత్సలకు ఆగస్టు నుంచి రూ.10లక్షల బీమా వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. సిద్ధిపేటలో కార్మిక భవన నిర్మాణానికి ఎకరా స్థలం కేటాయిస్తామన్నారు.



Tags:    

Similar News